Header Banner

ఏపీలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు! ఒక్కరోజులోనే అంత ఆదాయం!

  Sun Feb 02, 2025 08:58        Politics

రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి 30, 31న తేదీల్లో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. తద్వారా ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. శుక్రవారం ఒకరోజే ఏకంగా రూ.139 కోట్లు జమకాగా.. గురువారం నాడు రూ.107 కోట్ల వరకు ఆదాయం రావడం విశేషం. రెండు రోజుల్లో 30వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా 246 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ముఖ్యంగా రాజధాని అమరావతి చుట్టుపక్కల ఉన్న గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోనే అత్యధికంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

 

శనివారం నుంచి భూముల కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి వచ్చాయి. సవరించిన విలువల ద్వారా రిజిస్ట్రేషన్‌ ఛార్జీల భారం పెరుగుతుందన్న ఉద్దేశంతో సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. అత్యధికంగా గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో గురువారం 1,184, 946, 944, 715, 702 చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికారులు తెలిపారు. శనివారం నుంచి కొత్త ధరలు అమలవుతుండటంతో సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కొన్నిచోట్ల సర్వర్లు కూడా మొరాయించాయి.

 

ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు!  

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ విలువలో ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేసింది. గత ప్రభుత్వంలో పెంచిన విలువలను సవరించింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో విలువ తగ్గించగా.. మరికొన్నిచోట్ల పెంచారు. అయితే, కొన్నిచోట్ల యథాస్థితి కొనసాగించారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు సగటున 20 శాతం మేర విలువలు పెరిగాయి. 

 

నివాస స్థలాలు, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ విలువలను సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్నిచోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్‌-రిజిస్ట్రార్‌ ఆఫీసు పరిధిలో ఎకరం పొలం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.1.96 కోట్లు ఉండగా, దాన్ని రూ.30 లక్షలకు తగ్గించారు. 'రాష్ట్రవ్యాప్తంగా 16,997 గ్రామాల్లో 9,054 వార్డుల్లో భూముల విలువ సవరణ.. 68 గ్రామాలకు సంబంధించి ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. 158 గ్రామాలు, 145 వార్డుల్లో భూములు విలువ తగ్గించాము' అని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తెలిపింది. 

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవిపెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లుకార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Politics #TDP #JSP #YCP #PawanKalyan #Janasena #AP #AndhraPradesh #YSJagan #Assembly #BJP #NaraLokesh #PawanKalyan #PSPK #HighCourt #Amaravathi #BJP